
‘గుడివాడ’కు రోజా పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన గుడివాడ రోజా రమణీ బాయి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): అనారోగ్యంతో మృతి చెందిన గుడివాడ రోజా రమణీ బాయి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆదివారం మిందిలోని వారి స్వగృహంలో పరామర్శించారు. రోజా రమణీ బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె భర్త, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గుడివాడ అప్పలరామ్మూర్తిని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో అతని నివాసంలో సమావేశమయ్యారు.
పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఆమె వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర అధికారి ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.