తాడ్వాయి మండలం మేడా రం జంపన్నవాగులో ఈ నెల 24న స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన గూటోజు శ్రీధర్‌కుమార్(36) మృతదేహం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్ద కనిపించింది.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
Jul 31 2016 12:39 AM | Updated on Sep 4 2017 7:04 AM
ఏటూరునాగారం : తాడ్వాయి మండలం మేడా రం జంపన్నవాగులో ఈ నెల 24న స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన గూటోజు శ్రీధర్‌కుమార్(36) మృతదేహం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్ద కనిపించింది. రేగొండ మండలం మడతపల్లికి చెందిన శ్రీధర్ ములుగురోడ్డులో ఫర్నీచర్ వర్క్ చేసుకుంటూ కుటుంబం తో వరంగల్‌లో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులతో మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆయన వచ్చారు. ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి గల్లంతయ్యాడు. ఆరు రోజుల అనంతరం మృతదేహం ఏటూరునాగారంలో తే లింది. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Advertisement
Advertisement