మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలి | Militant struggles need to plan | Sakshi
Sakshi News home page

మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలి

Aug 4 2016 11:50 PM | Updated on Aug 14 2018 2:34 PM

మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలి - Sakshi

మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలి

రాష్ట్రంలోని రాచరిక, అరాచక కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై మిలిటెంట్‌ పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
  • తొర్రూరు : రాష్ట్రంలోని రాచరిక, అరాచక కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై మిలిటెంట్‌ పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అమ్మాపురంలో సీపీఐ నియోజకవర్గ నాయకుడు ముద్దం శ్రీనివాస్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు.  ముందుగా శ్రీనివాస్‌రెడ్డి విగ్రహాన్ని వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుధాకర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సీపీఐ  కార్యదర్శి భూర్గు యాదగిరి అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటూ అనేక ఉద్యమాలు చేసిన గొప్ప విప్లవకారుడు శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడారు. 
    నల్లదనం వెలికితీత హామీలు ఏమయ్యాయి
    కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అమరవీరులు ముద్దం శ్రీనివాస్‌రెడ్డి, శంకరబోయిన మల్లయ్య స్తూపాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఇతర దేశాలు తిరగడం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ రెండేళ్లుగా పిట్టకథలు, మాయమాటలు, దగాకోరు హామీలతో పాలన సాగిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్ళపెల్లి శ్రీనివాస్‌రావు, విజయసార«థి, తమ్మెర విశ్వేశ్వర్‌రావు,  సుబ్బారావు, ఓమ భిక్షపతి, ముద్దం మహబూబ్‌రెడ్డి,  శ్రీమన్నారానాయణ,  మల్లయ్య, ఎల ్లయ్య, ఉప సర్పంచ్‌ బంగారమ్మ, ఎంపీటీసీ యాకలక్ష్మి బ్రహ్మయ్య, కార్మికులు, కళాకారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement