ప్రియురాలిని హతమార్చి తాను ఆత్మహత్య | man murders his lover and suicide in srikalahasti | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని హతమార్చి తాను ఆత్మహత్య

Jul 12 2016 10:07 PM | Updated on May 10 2018 12:34 PM

ప్రియురాలిని హతమార్చి తాను ఆత్మహత్య - Sakshi

ప్రియురాలిని హతమార్చి తాను ఆత్మహత్య

ప్రియురాలిపై అనుమానంతో ఆమెను హతమార్చిన ప్రియుడు, తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

శ్రీకాళహస్తి: ప్రియురాలిపై అనుమానంతో ఆమెను హతమార్చిన ప్రియుడు, తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కథనం వివరాల ప్రకారం .. కేవీబీపురం వుండలం కళత్తూరుకు చెందిన గుణశేఖర్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల కిందట అదే మండలం రాయిపేడుకు చెందిన అరుణ(33)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అరుణ వివాహిత అయినప్పటికీ భర్తతో విబేధాలు వచ్చి ఒంటరిగా ఉంటోంది. ఇటీవల అరుణ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు గుణశేఖర్ అనుమానించాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు.

అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు లాడ్జికి ఆమెను ఆదివారం రాత్రి తీసుకువచ్చాడు. సోమవారం ఆమెను గొంతు బిగించి హతమార్చాడు. మృతి చెందిందని నిర్దారించుకున్న గుణశేఖర్ గదికి తాళం వేసుకుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ సోమవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం లాడ్జి గది నుంచి దుర్వాసన వస్తుండంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పోలీసులు తాళాలు పగలగొట్టి గదిలోకి వెళ్లడంతో అరుణ మృతదేహం రోప్‌కు వేలాడుతూ కనిపించింది. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో పట్టాలపై రైల్వే పోలీసులు ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన విషయూన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతుని జేబులో లాడ్జికి చెందిన తాళంచెవి ఉండటాన్ని గుర్తించి కేవీబీపురంలో విచారణ చేపట్టారు. దీంతో హత్యోదంతానికి సంబంధించిన వాస్తవాలు వెలుగుచూశాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement