భార్య పుట్టింటికి వెళ్లిందని.. | Man commits suicide worried about wife | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని..

Jun 13 2016 8:40 PM | Updated on Sep 4 2017 2:23 AM

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పాల్వంచ(ఖమ్మం): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పి. శ్రీను(26)కు రెండేళ్ల క్రితం వివాహమైంది.

ఈ మధ్య కాలంలో తాగుడికి బానిసైన శ్రీను భార్యతో గొడవపడుతుండటంతో.. విసిగి వేసారిన ఆమె ఈ రోజు పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement