రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించకుపోయారు.
మిర్యాలగూడఅర్బన్
రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించకుపోయారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్‌నగర్‌కు చెందిన పున్నం శ్రీనివాస్ ఏపీ24టీబీ 1316 నంబర్ గల లారీని కొనుగోలు చేసి తానే డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కిరాయికి పోయి వచ్చిన అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఎఫ్‌సీఐ సమీపంలోని రెడ్డీ హోటల్ వద్ద లారీని నిలిపి వేసి తన నివాసానికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి చూస్తే లారీ కనిపించలేదు. దీంతో కంగారు పడిన శ్రీనివాస్ చుట్టుపక్కల వెతికినా లారీ కనిపించకపోవడంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.