కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పడమటూరు గ్రామానికి చెందిన ఒక యువకుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష పడింది.
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పడమటూరు గ్రామానికి చెందిన ఒక యువకుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బోయ రాములు కుమార్తె సన్నిహితంగా ఉంటోంది. ఇది నచ్చని రాములు మనోహర్‌ను చంపేందుకు పథకం పన్నాడు. ఈ మేరకు 2013లో మార్చి 2వ తేదీన అతడిని పొలం వద్దకు పిలిపించాడు. రాములుతోపాటు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, విజయ్ కలిసి మనోహర్‌ను విపరీతంగా కొట్టి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని నేరం రుజువు కావటంతో నిందితులు ముగ్గురికీ యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు.