భూములను పరిశీలించిన డీఎఫ్‌ఓ | land survey by DFO | Sakshi
Sakshi News home page

భూములను పరిశీలించిన డీఎఫ్‌ఓ

Aug 26 2016 9:34 PM | Updated on Sep 4 2017 11:01 AM

ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమిలోకి ఫారెస్టు అధికారులు రానివ్వడం లేదని ఫిర్యాదు చేయడంతో మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల డీఎఫ్‌ఓ ప్లయింగ్‌స్కాడ్‌‌ రవీంద్రరాథోడ్‌ శుక్రవారం విచారణకు వచ్చారు.

శివ్వంపేట : ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమిలోకి ఫారెస్టు అధికారులు రానివ్వడం లేదని ఫిర్యాదు చేయడంతో మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల డీఎఫ్‌ఓ ప్లయింగ్‌స్కాడ్‌‌ రవీంద్రరాథోడ్‌ శుక్రవారం విచారణకు వచ్చారు. కొత్తపేట గ్రామానికి చెందిన హరినాథ్‌కు 480 సర్వే నెంబర్‌లో రెవెన్యూ అధికారులు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. సాగుకు చేయడానికి పోతే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని శివ్వంపేట మాజీ సర్పంచ్‌ పబ్బరమేష్‌గుప్తా ఫారెస్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు రవీ‍ంద్రరాథోడ్‌ భూమిని పరిశీలించారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement