దింపు కార్మికుడి దుర్మరణం
కొబ్బరిచెట్టు ఎక్కి దింపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై దింపు కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన భట్నవిల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. అనాతవరం బాలయోగి కాలనీకి చెందిన పరమట నాగేశ్వరరావు(50) భట్నవిల్లి గ్రామంలోని రైతు పొలంలో దింపు తీస్తుండగా, 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపైనే మరణించాడు. స్థానికులు అతడిని కిందకు దించేటప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ..
అమలాపురం రూరల్ :
కొబ్బరిచెట్టు ఎక్కి దింపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై దింపు కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన భట్నవిల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. అనాతవరం బాలయోగి కాలనీకి చెందిన పరమట నాగేశ్వరరావు(50) భట్నవిల్లి గ్రామంలోని రైతు పొలంలో దింపు తీస్తుండగా, 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపైనే మరణించాడు. స్థానికులు అతడిని కిందకు దించేటప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ అచ్చిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.