
'మా సీఎంకు లగడపాటి సర్టిఫికెట్ అవసరం లేదు'
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు...
రాయికల్ (నిజామాబాద్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు అంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాళేశ్వరంలో పుష్కరస్నానం చేసిన సందర్భంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పుష్కరాలను అన్ని విధాలుగా ఘనంగా నిర్వహించడం ప్రభుత్వం బాధ్యతని, ఇందుకు సీఎం కేసీఆర్‌కు లగడపాటి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
మంగళవారం ఆమె కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి పుష్కర స్నానాల కోసం తెలంగాణకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, ఇది గమనించే లగడపాటి కాళేశ్వరానికి వచ్చారన్నారు.