27న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా


ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌)  : 

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం రోడ్డు దగ్గర ఉన్న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజñ క్టు డైరెక్టర్‌ మల్లిబాబు తెలిపారు. విజయవాడలోని పీఎస్‌బీ ఆటోమొబైల్స్‌లో పనిచేయడానికి 50 మంది డ్రైవర్లు (హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి), వెహికల్‌ క్లీనర్స్, వర్క్‌షాపు క్లీనర్స్‌ (క్లీనింగ్‌ మీద ఆసక్తి కలవారు) కావాలన్నారు. 25 ఏళ్లు నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. వివరాలకు 94413 59873ను సంప్రదించాలన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top