హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ఉద్యోగులు నూతన జిల్లాలకు తరలుతున్నారు. తాజాగా శనివారం జనగామ జిల్లాకు కేటాయించిన వారు వెళ్లారు.
జనగామకు తరలిన విద్యాశాఖ ఉద్యోగులు
Oct 9 2016 12:15 AM | Updated on Oct 17 2018 3:38 PM
విద్యారణ్యపురి : హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ఉద్యోగులు నూతన జిల్లాలకు తరలుతున్నారు. తాజాగా శనివారం జనగామ జిల్లాకు కేటాయించిన వారు వెళ్లారు. ఫర్నిచర్, బీరువాలు, కంప్యూటర్లు, ఫైళ్లు తీసుకెళ్లారు. జనగామ డీఈఓ కార్యాలయాన్ని అక్కడి వీవర్స్ కమ్యూనిటీహాల్‌లో కేటాయించారు. వారితోపాటు పరిస్థితి సమీక్షించేందుకు డీఈఓ పి.రాజీవ్ కూడా వెళ్లారు. మంగళవారం నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో ఉద్యోగులు ముందే వెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఈనెల 7న మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ఉద్యోగులు వెళ్లిన విషయం తెలిసిందే. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి కార్యాలయాన్ని సర్వశిక్షా అభియా¯ŒS కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఫైళ్లను త్వరలో తరలించనున్నారు.
Advertisement
Advertisement