అంతర్జాతీయస్థాయికి ఎదగాలి | International | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయస్థాయికి ఎదగాలి

Sep 4 2016 11:09 PM | Updated on Sep 4 2017 12:18 PM

అంతర్జాతీయస్థాయికి ఎదగాలి

అంతర్జాతీయస్థాయికి ఎదగాలి

సైక్లింగ్‌ క్రీడాకారులు జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని చాటాలని ఆర్డీవో యాదిరెడ్డి అన్నారు. జిల్లా సైక్లింగ్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దివంగత సైక్లింగ్‌

నిజామాబాద్‌స్పోర్ట్స్‌: సైక్లింగ్‌ క్రీడాకారులు జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని చాటాలని ఆర్డీవో యాదిరెడ్డి అన్నారు. జిల్లా సైక్లింగ్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దివంగత సైక్లింగ్‌ సంఘం కార్యదర్శి భూలోకం చలపతిరావు స్మారక టోర్నీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యాదిరెడ్డి మాట్లాడుతూ చలపతిరావు సైక్లింగ్‌ క్రీడ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించి రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొటారని అసోసియేషన్‌ కార్యదర్శి భూలోకం విజయ్‌కాంత్‌రావు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు గడిల రాములు, సైక్లింగ్‌ సంఘం అధ్యక్షుడు జీవీ కృపాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, రాజ్‌కుమార్‌సుబేదార్, సురేందర్, పద్మారావు, మధు, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
విజేతలు వీరే: అండర్‌–14 విభాగంలో.. రాకేశ్‌(ప్రథమ), ప్రేమ్‌కుమార్‌(ద్వితీయ), బాల్‌వీర్‌(తృతీయ), అండర్‌–18లో..శివాజీ(ప్రథమ), లలి™Œ పాఠక్‌(ద్వితీయ), ఎస్‌ ఆకాశ్‌(తృతీయ), మహిళల విభాగంలో.. అలేఖ్యపాఠక్‌(ప్రథమ), శిల్పచవాన్‌(ద్వితీయ), చంద్రలేఖ(తృతీయ), పురుషుల విభాగంలో.. దినకర్‌(ప్రథమ), శివ(ద్వితీయ), రాజు (ఆర్మూర్‌) తృతీయస్థానాల్లో నిలిచారు.
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement