ఊట్కూర్: కొందరు ఎమ్మెల్యేలు రైతు బిడ్డలమంటూ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ ఆరోపించారు.
69 జీఓను అమలు చేయాలి
Jul 24 2016 9:57 PM | Updated on Sep 4 2017 6:04 AM
ఊట్కూర్ : కొందరు ఎమ్మెల్యేలు రైతు బిడ్డలమంటూ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ ఆరోపించారు. రైతు బిడ్డలైన నాయకులు తమ జన్మసార్థకం చేసుకోనేందుకుగాను 69 జీఓను అమలు చేయాలన్నారు. ఆదివారం బిజ్వార్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో తనను రైతుబిడ్డను కానని చెప్పడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా జిల్లావ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులు సాధించేందుకుగాను రైతు సమస్యలపై ఎవరూ చేయనన్ని పాదయాత్రలు, ఉద్యమాలు చేశానన్నారు. ఈ సమావేశంలో మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు విజయన్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కష్ణయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Advertisement


