హైదరాబాద్ను ఐటీ హబ్గా నేనే మార్చా: చంద్రబాబు | I have develops Hyderabad into IT hub says chandrababu naidu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను ఐటీ హబ్గా నేనే మార్చా: చంద్రబాబు

Jan 11 2016 11:50 AM | Updated on Sep 3 2017 3:29 PM

హైదరాబాద్ను ఐటీ హబ్గా నేనే మార్చా: చంద్రబాబు

హైదరాబాద్ను ఐటీ హబ్గా నేనే మార్చా: చంద్రబాబు

సన్రైజ్ ఆంధ్రప్రదేశ్కు ఓ వరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో రెండోరోజు ఆయన ప్రసంగించారు.

విశాఖ : సన్రైజ్ ఆంధ్రప్రదేశ్కు ఓ వరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో  రెండోరోజు ఆయన  ప్రసంగించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్లో భారత్ సూపర్ పవర్గా మారుతుందని, పెట్టుబడులకు ఇండియా అనుకూలమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ చాలా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. అయితే ఏపీ వృద్ధి రేటు భారత్ వృద్ధిరేటును అధిగమించిందన్నారు.

మత్స్య పరిశ్రమ, ఎగుమతుల్లో ఏపీ టాప్లో ఉందని, మరో ఆరు నెలల్లో గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు.  ఆంధ్రపద్రశ్లో సహజ వనరులకు కొదవ లేదంటూ... సింగపూర్, హాంకాంగ్ పోర్టుల కంటే ఏపీకి విస్తృత సముద్రం ఓ వరమన్నారు. వచ్చే మూడు,నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

 

తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించినట్లు చంద్రబాబు తెలిపారు.  అంతేకాకుండా హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చింది తానేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. మైక్రోసాప్ట్ సంస్థను హైదరాబాద్కు ఆహ్వానించింది తానేనని చంద్రబాబు అన్నారు.  సీఐఐ సదస్సులో  ఏపీ సర్కార్ నేడు ఐటీ, టూరిజనం సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement