అమ్మ, కొడుకు కలిసి.. ఉరేసి చంపేశారు! | husband murdered by wife and son | Sakshi
Sakshi News home page

అమ్మ, కొడుకు కలిసి.. ఉరేసి చంపేశారు!

Apr 29 2016 1:55 PM | Updated on Sep 26 2018 6:15 PM

మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని అతని భార్య, కుమారుడే ఉరి వేసి చంపేశారు.

జ్యోతినగర్: మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని అతని భార్య, కుమారుడే ఉరేసి చంపేశారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 27వ తేదీన జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలివీ... రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కొమురయ్య అనే సింగరేణి కార్మికుడు నివాసం ఉంటున్నాడు.

మద్యం తాగే అలవాటున్న కొమురయ్య రోజూ భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య వినోద, కుమారుడు సాయికుమార్ కొమురయ్యను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 27వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కొమురయ్యను వారిద్దరూ కలిసి కొట్టి, అనంతరం ఉరేసి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించటంతో నిజం వెలుగులోకి వచ్చింది. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement