నాన్నే చంపించాడు! | honour killing: father killed daughter in nizamabad district | Sakshi
Sakshi News home page

నాన్నే చంపించాడు!

Feb 13 2017 5:19 PM | Updated on Sep 5 2017 3:37 AM

నాన్నే చంపించాడు!

నాన్నే చంపించాడు!

మక్లూరు మండలం అమ్రజ్ పూర్ లో పరువు హత్య ఆలస్యంగా బయటపడింది.

నిజామాబాద్: మక్లూరు మండలం అమ్రజ్ పూర్ లో పరువు హత్య ఆలస్యంగా బయటపడింది. గత నెల 27న జక్రాన్ పల్లి మండలం పడకల్ వద్ద రోజా అనే యువతి హత్యకు గురైంది. ఆమెను కన్నతండ్రి రాజన్న హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వేరే కులం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే కోపంతో అతడీ కిరాతకానికి పాల్పడినట్టు నిర్ధారించారు.

నిందితుడు రాజన్నతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఘటనా స్థలంలో దొరికిన మృతురాలి పాదరక్ష ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement