హోంగార్డ్స్‌ సేవలు ఎనలేనివి | homegaurds rising welfare day celebrations | Sakshi
Sakshi News home page

హోంగార్డ్స్‌ సేవలు ఎనలేనివి

Dec 6 2016 8:53 PM | Updated on Sep 2 2018 3:08 PM

హోంగార్డ్స్‌ సేవలు ఎనలేనివి - Sakshi

హోంగార్డ్స్‌ సేవలు ఎనలేనివి

సమాజానికి హోంగార్డులు అందిస్తున్న సేవలు ఎనలేనివని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. పోలీసు శాఖలో వివిధ విభాగాలతోపాటు, పలు శాఖల్లో డిప్యూటేషన్‌పై ఉన్న వారు సమర్థంగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు.

విజయవాడ(లబ్బీపేట) సమాజానికి హోంగార్డులు అందిస్తున్న సేవలు ఎనలేనివని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. పోలీసు శాఖలో వివిధ విభాగాలతోపాటు, పలు శాఖల్లో డిప్యూటేషన్‌పై ఉన్న వారు సమర్థంగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. 54వ హోంగార్డ్స్‌ ఫౌండేషన్‌ డే, హోంగార్డ్స్‌ రైసింగ్‌ డే సెలబ్రేషన్స్‌ మంగళవారం మహాత్మాగాంధీ రోడ్డులోని సిటీ ఆర్మ్‌డ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. సీపీ గౌతమ్‌ సవాంగ్‌ తొలుత హాంగార్డ్స్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డ్స్‌ కవాతు నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతోపాటు, హోంగార్డులు కృషి ఎనలేనిదన్నారు. నగర కమిషనరేట్‌ పరిధిలో 1078 మంది హోంగార్డులు వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రతినెలా రూ.20 సేకరిస్తున్నామని, వాటిలో రూ.10 సెంట్రల్‌ఫండ్‌కు, రూ.10 హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు అందజేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
పలువురికి ఆర్థిక సాయం
నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు ఒకరోజు వేతనాన్ని సేకరించి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన హోంగార్డులు ఎం.మోహనరావుకు రూ.34 వేలు, ఎం.ప్రభాకరరావుకు రూ.38,650, కె.శ్యామ్‌బాబుకు రూ.39,600 అందజేశారు. ఇటీవల మృతి చెందిన హోంగారు కె.రాము కుటుంబానికి రూ.3.69 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ హరికుమార్, డీసీపీ అడ్మినిస్ట్రేషన్‌ అశోక్‌కుమార్‌లతోపాటు, హోంగార్డ్స్‌ కమాండెంట్, పలువురు ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు. హోంగార్డులకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement