హిందీ దివస్‌ జిల్లాస్థాయి పోటీలు | hindi divas compitations district level | Sakshi
Sakshi News home page

హిందీ దివస్‌ జిల్లాస్థాయి పోటీలు

Sep 13 2016 10:50 PM | Updated on Sep 4 2017 1:21 PM

హిందీ దివస్‌ పురస్కరించుకొని రాషీ్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ‘హిందీ దివస్‌’ అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించారు. అ««ధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు.

కాకినాడ కల్చరల్‌ : 
హిందీ దివస్‌ పురస్కరించుకొని రాషీ్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ‘హిందీ దివస్‌’ అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించారు. అ««ధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా పరిషత్‌ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్, కార్యదర్శి ఏఏవీఎస్‌ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.రాధాకృష్ణ, పరిషత్‌ మహిళా కార్యదర్శి ఎ.స్వర్ణమంజుల, గౌరవ అధ్యక్షుడు వి.పళ్లంరాజు వ్యహరించారు. వ్యాస రచన పోటీలలో సీనియర్‌ విభాగంలో ఎన్‌.ప్రశాంత్‌( జెడ్పీ పాఠశాల,  గైగోలుపాడు), జూనియర్‌ విభాగంలో ఆర్‌.బిందు (మార్గదర్శి హైస్కూల్, తాళ్లరేవు), వక్తృత్వపోటీలలో ఎం.అనూష ( పగడాలపేట మున్సిపల్‌ ఉన్నతపాఠశాల, కాకినాడ) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని న్యాయనిర్ణేతలు తెలిపారు. వీరు హిందీ దివస్‌ (సెప్టెంబర్‌14) నాడు  ఏలూరులోని యంగ్‌మెన్‌ హిందూ అసోసియేసన్‌లో జరిగే రాష్ట్రాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పరిషత్‌ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లాస్థాయి  పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా ప్రతాలు, బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యం, హిందీ సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement