breaking news
hindi divas
-
శాస్త్ర, సాంకేతిక రంగాల భాషగా హిందీ!
గాంధీనగర్: మాట్లాడే భాషగా మాత్రమేకాదు శాస్త్ర, సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభిలషించారు. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఐదవ అఖిల భారతీయ రాజభాష సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ హిందీకి ఇతర భారతీయభాషలకు మధ్య ఎలాంటి ఘర్షణ లేనేలేదు. దయానంద సరస్వతి, మహాత్మాగాంధీ, కేఎం మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు హిందీని ఆమోదించారు. హిందీ బాషను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. గుజరాత్లో హిందీ, గుజరాతీ రెండూ తమ స్పష్టమైన ఉనికిను చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రాష్ట్రంలో రెండు భాషలు ఉన్నాసరే రెండూ అభివృద్ధి చెందగలవని గుజరాత్ నిరూపించింది’’ అని అన్నారు.హిందీ కేవలం భాష కాదు‘‘హిందీ కేవలం మాట్లాడే భాష కాదు. పరిపాలనా భాష కూడా. శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ పరిపాలనలో హిందీని ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలా అన్ని భాషలను కీలక రంగాల్లో పరిపాలన సౌలభ్యం కోసం వినియోగిస్తే పౌరులు సైతం ఈ భాషలను విరివిగా ఉపయోగిస్తారు. సంస్కృత భాష అనేది మనకు జ్ఞానగంగను ప్రసాదించింది. ఆ జ్ఞానాన్ని ఇంటింటికీ హిందీ మోసుకొచ్చింది. స్థానిక భాషల ద్వారా ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికీ చేరువైంది. మాతృభాషలోకాకుండా ఇతర భాషలో చిన్నారులకు కొత్త విషయాన్ని చెబితే మళ్లీ మాతృభాషలోనే దానిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం మెదడు సామర్థ్యంలో 25 నుంచి 30 శాతం ఖర్చవుతుంది. సామర్థ్యం వృథాను తగ్గించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మాతృభాషలోనే మాట్లాడాలి. లేదంటే పిల్లలకు కొత్త అంశాలను తెల్సుకోవడం కష్టమవుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది’’ అని అన్నారు. ‘‘గుజరాతీ ఉన్నప్పటికీ గుజరాత్లో విద్యాంశాలు హిందీలోనే కొనసాగుతున్నాయి. ఇది మహాత్మాగాంధీ, దయానంద్ సరస్వతి వల్లే సాధ్యమైంది. అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రజలు హిందీలోనూ సంప్రతింపులు కొనసాగించాలి’’ అని షా కోరారు. ‘హిందీ శబ్ద సింధూ అనేది 51,000 పదాలతో మొదలైంది. ఇప్పుడు 7,00,000 పదాలతో అలరారుతోంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని భాషల్లో అత్యధిక పదాల నిఘంటువుగా చరిత్రకెక్కుతుంది’’ అని ఆయన అన్నారు. మోదీ శుభాకాంక్షలు‘‘హిందీ కేవలం భాష, సమాచారమార్పిడి అనుసంధానం కాదు.. మన భారతీయ సంస్కృతి, ఉనికికి సజీవ వారసత్వ సంపదగా హిందీ భాసిల్లుతోంది. హిందీ దివస్ రోజు మీకందరికీ అంతులేని శుభాకాంక్షలు. హిందీ దివస్ సందర్భంగా భారతీయ భాషలన్నీ పరిఢవిల్లాలని ప్రతిజ్ఞచేద్దాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఆదివారం పోస్ట్ చేశారు. -
హిందీపై అమిత్ షా సందేశం హాస్యాస్పదం
చెన్నై: హిందీ భాష దేశంలోని ఇతర భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తోందని, అన్ని భాషలను, యాసలను గౌరవిస్తోందని ‘హిందీ దివస్’ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచి్చన సందేశాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం తప్పుపట్టారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అమిత్ షా సందేశం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఎలా ఏకం చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
Karnataka: బలవంతంగా హిందీని రుద్దొద్దు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): హిందీ దివస్‌ను వ్యతిరేకిస్తూ కన్నడనాట మంగళవారం నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని, ఇది ముమ్మాటికీ ప్రాంతీయ భాషలపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చళవళి వాటాళ్ పార్టీ, జయకర్ణాటక తదితర పార్టీలు, సంఘాల నాయకులు రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. బెంగళూరులోని మైసూరు బ్యాంకు సర్కిల్లో కన్నడ చళవళి వాటాళ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు హిందీ పోస్టర్లను తగులబెట్టి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగరాజు మాట్లాడుతూ కర్ణాటకలో కన్నడ భాషకే అగ్రతాంబూలం ఉండాలని, కన్నడిగుడే దొర అని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతంగా హిందీ భాషను అమలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బ్యాంక్, రైల్వే, తపాలా కార్యాలయాల్లో కన్నడ తప్పకుండా ఉండాలన్నారు. డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు మాట్లాడుతూ హిందీ పుట్టుకముందే కన్నడ భాష ఉదయించిందని తెలిపారు. బ్యాంకుల ముందు ధర్నా చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వేడి పుట్టిస్తామని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ తెలిపారు. చదవండి: టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ -
హిందీని మాపై రుద్దొద్దు
చెన్నై: దేశమంతటా ఒకే భాష అమలు సాధ్యం కాదని సీనియర్ నటుడు రజనీకాంత్ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాదని, ఉత్తరాది రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తాయని బుధవారం మీడియాతో అన్నారు. దేశమంతటా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ దివస్ నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా, ఏకత్వానికైనా ఒకే భాష అవసరమని అయితే అది ఏ ఒక్కరో తీసుకురాలేరని అన్నారు. అందుకే హిందీని దేశమంతటా అమలు చేయలేమన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే. -
హిందీ దివస్ జిల్లాస్థాయి పోటీలు
కాకినాడ కల్చరల్ : హిందీ దివస్ పురస్కరించుకొని రాషీ్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘హిందీ దివస్’ అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించారు. అ««ధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్, కార్యదర్శి ఏఏవీఎస్ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.రాధాకృష్ణ, పరిషత్ మహిళా కార్యదర్శి ఎ.స్వర్ణమంజుల, గౌరవ అధ్యక్షుడు వి.పళ్లంరాజు వ్యహరించారు. వ్యాస రచన పోటీలలో సీనియర్ విభాగంలో ఎన్.ప్రశాంత్( జెడ్పీ పాఠశాల, గైగోలుపాడు), జూనియర్ విభాగంలో ఆర్.బిందు (మార్గదర్శి హైస్కూల్, తాళ్లరేవు), వక్తృత్వపోటీలలో ఎం.అనూష ( పగడాలపేట మున్సిపల్ ఉన్నతపాఠశాల, కాకినాడ) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని న్యాయనిర్ణేతలు తెలిపారు. వీరు హిందీ దివస్ (సెప్టెంబర్14) నాడు ఏలూరులోని యంగ్‌మెన్ హిందూ అసోసియేసన్లో జరిగే రాష్ట్రాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా ప్రతాలు, బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యం, హిందీ సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.