గణపతి లడ్డూలకు భలే డిమాండ్‌ | high demand to Ganesh laddu | Sakshi
Sakshi News home page

గణపతి లడ్డూలకు భలే డిమాండ్‌

Sep 18 2016 5:48 PM | Updated on Mar 28 2018 11:26 AM

వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూలకు భక్తుల నుంచి మంచి డిమాండ్‌ లభించింది. అనంతరం లడ్డూను వేలం వేయగా గ్రామానికి చెందిన అరుణ్‌రెడ్డి రూ.1,71,000 పాడి సొంతం చేసుకున్నారు. వేలం వేయగా మేడ్చల్‌కు చెందిన మధుకర్‌యాదవ్‌ రూ.1,01,116 పాడి సొంతం చేసుకున్నాడు.

మేడ్చల్‌: వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూలకు భక్తుల నుంచి మంచి డిమాండ్‌ లభించింది. మండలంలోని గుండ్లపోచంపల్లిలో తెలుగు యువత ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్వామివారికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జంగయ్యయాదవ్‌, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, టీడీపీ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి,  పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూను వేలం వేయగా గ్రామానికి చెందిన అరుణ్‌రెడ్డి రూ.1,71,000 పాడి సొంతం చేసుకున్నారు. పట్టణంలోని అత్వెల్లిలో నక్షత్ర యూత్‌ ఏర్పాటు చేసిన గణేషుడికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందారెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్‌, నాయకులు పూడూర్‌ నర్సింహారెడ్డి, ఈశ్వరయ్య, రవీందర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌గుప్తా తదితరులు పూజలు చేశారు. అనంతరం వేలం వేయగా మేడ్చల్‌కు చెందిన మధుకర్‌యాదవ్‌ రూ.1,01,116 పాడి సొంతం చేసుకున్నాడు. అత్వెల్లి రాణాప్రతాప్‌ యూత్‌, పూడూర్‌, మేడ్చల్‌లోని పలు చోట్ల ప్రతిష్ఠించిన వినాయకులను ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement