గుట్టుగా.. గుట్కా రాకెట్‌ | gutka rocket in tuni | Sakshi
Sakshi News home page

గుట్టుగా.. గుట్కా రాకెట్‌

Aug 7 2016 1:06 AM | Updated on Sep 26 2018 6:49 PM

గుట్టుగా.. గుట్కా రాకెట్‌ - Sakshi

గుట్టుగా.. గుట్కా రాకెట్‌

శనివారం విజిలె¯Œæ్స డీఎస్సీ పీఆర్‌ రాజేంద్రకుమార్, సీఐ ఎన్‌వీ భాస్కరరావు ఆధ్వర్యంలో కేఓ మల్లవరంలో నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు సుర్ల గంగాధర్‌ కనుసన్నల్లోనే ఇక్కడ గుట్కాలు

విచ్చలవిడిగా విక్రయాలు
విజిలెన్స్‌ దాడితో ఉలికిపాటు
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
తుని రూరల్‌ : గుట్టుచప్పుడు కాకుండా తుని మండలం కేఓ మల్లవరంలో నిర్వహిస్తున్న గుట్కా త యారీ కేంద్రం వెలుగులోకి రావడం జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల నకిలీ గుట్కాలు మార్కెట్‌ను ముంచెత్తాయని తేలడంతో, గుట్కా కు బానిసలైన వారు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.
శనివారం విజిలె¯Œæ్స డీఎస్సీ పీఆర్‌ రాజేంద్రకుమార్, సీఐ ఎన్‌వీ భాస్కరరావు ఆధ్వర్యంలో కేఓ మల్లవరంలో నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు సుర్ల గంగాధర్‌ కనుసన్నల్లోనే ఇక్కడ గుట్కాలు తయారు చేస్తున్నట్టు వెలుగుచూసింది. రూ.రెండు లక్షల విలువైన యంత్రాలు, రూ.18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు పట్టణంలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తయారీ ఇలా..
కొందరు అక్రమార్కులు నకిలీ గుట్కాలను తయారు చేస్తుండగా, కమీషన్లకు కక్కుర్తిపడే వ్యాపారులు చిల్లరగా విక్రయిస్తున్నారు. స్థానికంగా లభించే మసాలా దినుసులను మిశ్రమంగా చేసి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసినట్టుగా వ్యాపారులను నమ్మిస్తున్నారు. ఒరియా భాషలో ముద్రించిన కవర్లలో గుట్కాను నిర్ణీత మోతాదులో ప్యాకింగ్‌ చేస్తున్నారు. యాలకులు, పుగాకు, సున్నం, సోంఫ్, పెప్పర్, వక్కలు, ఇతర రసాయనాలను తునిలోనే కొనుగోలు చేస్తున్నారు. కేఓ మల్లవరంలో పూర్వం జీడిపప్పు తయారీ కేంద్రంగా ఉన్న భవనాలు, ప్రాంగణాన్ని అక్రమ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ గుట్కాలు ఘాటుగా ఉంటాయని, అధిక మోతాదు పెప్పర్‌ ఉండడం వల్ల స్వల్పకాలంలోనే అస్వస్థతకు గురవుతారని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం తెలిపారు. 
వివిధ కంపెనీల పేర్లతో..
సఫారీ–2000, గోకుల్‌ డీలక్స్‌ మిక్స్, మిరాజ్‌ తదితర కంపెనీల పేర్లతో గుట్కాలను తయారు చేస్తున్నారు. ఇందుకు మూడు యంత్రాలు, రెండు మిక్సర్లు, ఒక బాయిలర్‌ను ఏర్పాటు చేశారు. గోడౌ¯Œæలో బాయిలర్, ముడి సరుకును నిల్వ ఉంచగా, మరో భవనంలో తయారీ, ప్యాకింగ్‌ యంత్రాలు, తయారైన ప్యాకెట్లు ఉన్నాయి. దాడుల్లో ఏఓ జి.శ్రీనివాస్, పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం, కానిస్టేబుల్‌ స్వామి పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement