వడదెబ్బకు నవవరుడు బలి | groom die for sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు నవవరుడు బలి

May 1 2016 4:29 AM | Updated on Sep 3 2017 11:07 PM

వడదెబ్బకు నవవరుడు బలి

వడదెబ్బకు నవవరుడు బలి

పెళ్లి అయిన వారం రోజులకే నవ వరుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. నర్సాపూర్‌కు చెందిన మహ్మద్ సాదక్ అలీ మూడో కుమారుడు మహ్మద్

మరో నలుగురు..
వడదెబ్బతో నవ వరుడు మృతి
పెళ్లయిన వారం రోజులకే కన్నుమూత

 నర్సాపూర్ రూరల్: పెళ్లి అయిన వారం రోజులకే నవ వరుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. నర్సాపూర్‌కు చెందిన మహ్మద్ సాదక్ అలీ మూడో కుమారుడు మహ్మద్ ఆబేద్(26) శుక్రవారం స్థానిక సంతలో పండ్ల వ్యాపారం ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శనివారం సైతం మరోసారి పరీక్ష చేయించారు. సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆబేద్‌కు ఏప్రిల్ 22న సదాశివపేట మండలం సిద్దపూర్‌కు చెందిన నజేరాబేగంతో పెళ్లి జరిగింది. వారం రోజులకే ఆబేద్ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement