గ్రీన్‌ హెలిప్యాడ్‌ | green helipad | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ హెలిప్యాడ్‌

Aug 4 2016 9:26 PM | Updated on Sep 17 2018 7:44 PM

చుట్టూ ఆకర్షణీయంగా పరుస్తున్న కార్పెట్‌ గ్రాస్‌ - Sakshi

చుట్టూ ఆకర్షణీయంగా పరుస్తున్న కార్పెట్‌ గ్రాస్‌

భారత ప్రధాని పర్యటన కోసం వర్గల్‌ మండలం నెంటూరు వద్ద హెలిప్యాడ్‌లు హరిత శోభను సంతరించుకుంటున్నాయి.

వర్గల్‌: భారత ప్రధాని పర్యటన కోసం వర్గల్‌ మండలం నెంటూరు వద్ద హెలిప్యాడ్‌లు హరిత శోభను సంతరించుకుంటున్నాయి. ఆకాశంలో నుంచి కిందికి చూడగానే హెలిప్యాడ్‌లు పచ్చదనంతో ఆకట్టుకునేలా ఉద్యానవన శాఖ ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపడుతున్నది. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్ ఇంప్రెషన్‌’ అన్నట్లు ప్రధాని తొలి చూపులోనే మనసు దోచుకునేలా హెలిప్యాడ్‌ల చుట్టూ రెండు మీటర్ల మేర ఆకుపచ్చని కార్పెట్‌ గ్రాస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో ఎలాంటి లోపం లేకుండా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ సురేష్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం వరకు హెలిప్యాడ్ల చుట్టూ కార్పెట్‌ గ్రాస్‌ ఏర్పాటు పూర్తవుతుందని ఏడీ సురేష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement