
2019లో మహాకూటమి ఏర్పాటు: రేవంత్
2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలపి మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.
కొడంగల్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలపి మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో గురువారంరాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
మహాకూటమి కోసం అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ 2019లో తమకు పూర్తి మెజారిటీ రాకున్నా 2024లో మాత్రం ఖాయమన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, యువతకు 2019 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ తనపై రాజకీయంగా దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.