అందుబాటులో గడ్డి విత్తనాలు | grass seeds available | Sakshi
Sakshi News home page

అందుబాటులో గడ్డి విత్తనాలు

Aug 26 2016 10:40 PM | Updated on Jun 4 2019 5:04 PM

జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యకేంద్రాల్లో రాయితీ గడ్డి విత్తనాలు అందుబాటులో పెట్టామని పశుశాఖ జేడీ డాక్టర్‌ కె.జయకుమార్, పశుగ్రాసం విభాగం ఏడీ డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు.

అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యకేంద్రాల్లో రాయితీ గడ్డి విత్తనాలు అందుబాటులో పెట్టామని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ కె.జయకుమార్, పశుగ్రాసం విభాగం ఏడీ డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. కిలో మొక్కజొన్న విత్తనాలు పూర్తి విలువ రూ.49 కాగా అందులో రైతు వాటా రూ.12.25గా చెల్లించాలన్నారు.

అలాగే సీఎస్‌హెచ్‌ ఎంఎఫ్‌–24 రకం జొన్న విత్తనాలు కిలో పూర్తి విలువ రూ.56 కాగా అందులో రైతు రూ.14.10 ప్రకారం చెల్లించాలని తెలిపారు. ఇక సుగర్‌గ్రేజ్‌ జొన్న విత్తనాలు కిలో రూ.337 కాగా అందులో రైతు వాటాగా రూ.84.25 చెల్లించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement