చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే | girl student says sexually harrasment by contract lecturer | Sakshi
Sakshi News home page

చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే

Sep 4 2016 1:00 PM | Updated on Sep 4 2017 12:18 PM

చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే

చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ లెక్చరర్ కీచక పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం : శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ లెక్చరర్ కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని... తన కోరిక తీర్చాలని కాంట్రాక్ట్ లెక్చరర్ గంగాధర్ బెదిరించాడు. లేకుంటే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.

దాంతో గంగాధర్ను ఎగ్జామ్ వింగ్ నుంచి యూనివర్శిటీ అధికారులు తప్పించి.. చేతులు దులుపేసుకున్నారు. యూనివర్శిటీ అధికారుల చర్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అతడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement