బాలికతో భర్త కలిసుండటం చూసి.. | girl murder | Sakshi
Sakshi News home page

బాలికతో భర్త కలిసుండటం చూసి..

Jul 20 2016 9:36 AM | Updated on Jul 30 2018 8:29 PM

బాలికతో భర్త కలిసుండటం చూసి.. - Sakshi

బాలికతో భర్త కలిసుండటం చూసి..

తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

రామచంద్రపురం : తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం విలేకరులకు వివరాలు చెప్పారు. గ్రామానికి చెందిన కట్టా రాధాకృష్ణ, ఇదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఇంటిలో పనిచేసేందుకు తల్లిదండ్రుల వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాలికను పాఠశాలలో చేర్పించి చదివించేందుకు, పెద్దయ్యాక పెళ్లి చేసేలా మాట్లాడుకున్నారు. బాలికను 7వ తరగతి వరకు చదివించిన రాధాకృష్ణ, ఆ తర్వాత స్కూల్‌కు పంపలేదు. ఏడాదిన్నర క్రితం నుంచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంగా ఉన్న తన భార్య అన్నపూర్ణను గత నెల 7న రాధాకృష్ణ కాకినాడ వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు.

భార్య నిద్రపోయాక రాధాకృష్ణ ఆ బాలికతో కలిసి ఉండగా, అదే సమయంలో మెలకువ వచ్చిన ఆదిలక్ష్మి వారిని గమనించింది. భర్తతో, బాలికతో ఆమె గొడవకు దిగింది. ఈ క్రమంలో భార్యాభర్తలు కలిసి బాలికను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన రాధాకృష్ణ తన భార్యతో కలిసి ఇంటిలోనే బాలికను హతమర్చారు. గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనుచరుడు పంపన త్రిమూర్తులు సహకారంతో, ఆ బాలిక ఇంటిలో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూడడంతో, నిందితులు వీఆర్వో వద్ద మంగళవారం లొంగిపోయారు. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ఎస్సైలు ఫజల్‌ రహ్మాన్, ఎల్‌.శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement