
సామాజిక సేవకు కాలేరు రామోజీకి అవార్డు
మండలంలోని ఏదులాబాద్‌కు చెందిన కాలేరు రామోజీకి అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డును శనివారం రాత్రి అందుకున్నారు. నగరంలోని రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన కేంద్రంలో జీనిసిస్ అర్బన్ అండ్ రూరల్ సొసైటీ వారు అవార్డును అందచేశారు.
ఘట్‌కేసర్: మండలంలోని ఏదులాబాద్‌కు చెందిన కాలేరు రామోజీకి అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డును శనివారం రాత్రి అందుకున్నారు. నగరంలోని రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన కేంద్రంలో జీనిసిస్ అర్బన్ అండ్ రూరల్ సొసైటీ వారు అవార్డును అందచేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అనేక మందికి సేవ చేసినందుకు ఈ వార్డును అందచేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా కాలేరు రామాజీ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. మరింత బాధ్యతను అవార్డు పెంచిందన్నారు. ఎక్కువ మందికి సేవ చేయడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు. అవార్డు రావడంపట్ల మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.