వక్కతోటకు నిప్పు | fire to vakka thota | Sakshi
Sakshi News home page

వక్కతోటకు నిప్పు

Feb 24 2017 9:42 PM | Updated on Oct 1 2018 5:09 PM

అమరాపురం మండలం తమ్మడేపల్లిలో రైతు నాగరాజుకు చెందిన వక్కతోటకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు.

అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం తమ్మడేపల్లిలో రైతు నాగరాజుకు చెందిన వక్కతోటకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. శుక్రవారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా 25 వక్కచెట్లు, 25 సెంట్ల భూమిలోని తమలపాకు తీగ, ఐదు కొబ్బరి చెట్లు, అరిటి చెట్లు కాలిబూడిదైనట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

దానిమ్మ చెట్లకు నిప్పు
మడకశిర రూరల్‌ : తడకలపల్లి సమీపంలో రైతు మురళీకృష్ణ సాగు చేసిన దానిమ్మతోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దానిమ్మ, మామిడి, కొబ్బరి, చింతచెట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఉద్యాన అధికారులు పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement