పాము కాటుతో రైతు మృతి | farmer dies of snake byte | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

Aug 19 2017 9:46 PM | Updated on Oct 22 2018 2:22 PM

మండల పరిధిలోని చోళసముద్రంలో శనివారం ఉదయం కాకర్ల వెంకటనాయుడు(55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు.

కూడేరు: మండల పరిధిలోని చోళసముద్రంలో శనివారం ఉదయం కాకర్ల వెంకటనాయుడు(55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ దస్తగిరి అందించిన వివరాలు మేరకు.. వెంకటనాయుడు మంజునాథ్‌ అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో కళింగర పంట సాగు చేశాడు. పంట కాలం పూర్తవడంతో కళింగర తీగలు తొలగించేందుకు సిద్ధపడ్డాడు.

తీగలతో పాటు పాము కూడా చేతికి రావడంతో పామును విసిరే ప్రయత్నం చేయగా కాటు వేసింది. వెంటనే రైతు ద్విచక్రవాహనంలో ఇంటికి వచ్చి కుమారుడికి విషయం తెలిపి అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి ఇద్దరు వెళ్లారు. అక్కడ చికిత్స పొందిన గంటలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement