పొలంలోనే ఆగిన రైతు గుండె | farmer dies of heart stroke | Sakshi
Sakshi News home page

పొలంలోనే ఆగిన రైతు గుండె

Jul 22 2017 9:41 PM | Updated on Oct 1 2018 4:01 PM

పొలంలోకి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కొత్తచెరువు మండలం కేశాపురం రైతు సాంబశివ (63) కోపగానిపల్లి వద్ద గల పొలంలో పంట సాగు చేశాడు.

బుక్కపట్నం: పొలంలోకి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కొత్తచెరువు మండలం కేశాపురం రైతు సాంబశివ (63) కోపగానిపల్లి వద్ద గల పొలంలో పంట సాగు చేశాడు. శనివారం ఈ - క్రాప్‌ బుకింగ్‌ చేసుకునేందుకు పొలానికి వెళ్లి ఒక్కసారిగా గుండెపోటు రావటంతో కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వసంతకుమార్‌ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం బుక్కపట్నంలో నివాసముంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement