పొలం గట్టు పై ఉన్న చెట్టు విషయంలో ఇద్దరి రైతుల మధ్య చెలరేగిన వివాదంతో ఓ రైతు మృతి చెందాడు.
పొలంలో ఘర్షణ.. రైతు మృతి
Jul 22 2016 3:32 PM | Updated on Jun 4 2019 5:16 PM
కొడకండ్ల: పొలం గట్టు పై ఉన్న చెట్టు విషయంలో ఇద్దరి రైతుల మధ్య చెలరేగిన వివాదంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కొడకండల మండలం ఔతాపురం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల పొలాల మధ్య ఉన్న చెట్ల విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఓ చెట్టును నరికి దాయాది పొలంలో వేసినమ మరో రైతు అతని పై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


