తెలంగాణ ప్రాంత విద్యుత్‌ అధికారుల జంప్‌ | electricity department officers jump | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రాంత విద్యుత్‌ అధికారుల జంప్‌

Sep 8 2016 10:27 PM | Updated on Sep 5 2018 4:22 PM

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్‌ అధికారులు ఇక్కడి నుంచి జంప్‌ అయ్యారు.

చెప్పాపెట్టకుండా రిలీవ్‌
కర్నూలు(రాజ్‌విహార్‌): కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్‌ అధికారులు ఇక్కడి నుంచి జంప్‌ అయ్యారు. పై అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా సొంతంగా రిలీవ్‌ అయి తెలంగాణ ప్రాంతానికి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిలో విద్యుత్‌ భవన్‌లో సివిల్‌ విభాగం ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ కృష్ణారెడ్డితోపాటు ఏఈలు సుధాకర్‌ (డోన్‌ రూరల్‌), నాగరాజు (కోడుమూరు), వెంకటరమణ (ఆదోని కన్‌స్ట్రక్షన్‌), ఏఏఓలు శ్రీనివాసులు (ఎస్‌ఈ కార్యాలయం), వినోద్‌కుమార్‌ (కర్నూలు ఈఆర్‌ఓ), జేఏఓలు స్వప్న (సర్కిల్‌ కార్యాలయం), సురేష్‌ (కర్నూలు ఈఆర్‌ఓ), సబ్‌ ఇంజినీర్లు సుజాత (విద్యుత్‌ భవన్‌లో పర్చేజ్‌ విభాగం), మహేశ్వర రెడ్డి (పవర్‌ హౌర్‌)లు ఈనెల 2వ తేదీ నుంచి విధులకు హాజర కావడం లేదు. ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారం లేకపోవడంతో గైర్హాజర్‌ (అబ్సెంట్‌)గా భావిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి అధికారికంగా రిలీవ్‌ చేసి తెలంగాణకు పంపడంలో జాప్యం జరుగుతుండడంతో వీరంతా చెప్పాపెట్టకుండా వెళ్లినట్లు తెలుస్తోంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement