జిల్లా అధికారులపై మంత్రి బొజ్జలకు ఫిర్యాదు | district employspi bojja Fir | Sakshi
Sakshi News home page

జిల్లా అధికారులపై మంత్రి బొజ్జలకు ఫిర్యాదు

Jul 23 2016 10:21 PM | Updated on Apr 3 2019 5:55 PM

జిల్లాలో చేపట్టాల్సిన అభివద్ధి పనులకు జిల్లా స్థాయి అధికారులు సహకరించడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లాలోని ప్రజాపతినిధులు, నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు.

జిల్లా అధికారులపై మంత్రి బొజ్జలకు ఫిర్యాదు
చిత్తూరు(రూరల్‌):  జిల్లాలో చేపట్టాల్సిన అభివద్ధి పనులకు జిల్లా స్థాయి అధికారులు సహకరించడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్తూరులోని  జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లాలోని ప్రజాపతినిధులు, నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో వారు స్థానిక సమస్యలను ఆయన దష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్‌తో తలనొప్పిగా మారిందని, తాము చెప్పిన పనిచేయడం ఆయనకు తెలిపారు.  పార్టీలో నాయకులకు గుర్తింపు లేదని సమావేశాలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని  వాపోయారు. దీంతో పాటు మరిన్ని సమస్యలను ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ  ఈ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్‌ పర్సన్‌ గీర్వాణీ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సత్యప్రభ,  డిప్యూటీ మేయర్‌ సుబ్రమణ్యం, టీడీపీ నాయకులు  నాని, బద్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement