హీరోలకు ఐటెం పాటలే నచ్చుతాయి | director dasari participated in swarabhishekam | Sakshi
Sakshi News home page

హీరోలకు ఐటెం పాటలే నచ్చుతాయి

Aug 3 2016 12:25 PM | Updated on Oct 2 2018 3:16 PM

సమావేశంలో మాట్లాడుతున్న దాసరి నారాయణరావు - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న దాసరి నారాయణరావు

ఇప్పుడు రికార్డ్‌ డ్యాన్స్‌ల సంగీతమే హీరోలకు సంగీతమై కూర్చుందని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు సినీ రంగంలో నాకున్న మ్యూజికల్‌ హిట్స్‌ ఏ దర్శకుడికీ లేవని, అందుకు కారణం గొప్ప సంగీత దర్శకులు దొరకడమేనని మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత డాక్టర్‌ దాసరి నారాయణ రావు అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ఎస్‌ కొండలరావు అధ్యక్షతన దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావుకు స్వరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పుడు రికార్డ్‌ డ్యాన్స్‌ల సంగీతమే హీరోలకు సంగీతమై కూర్చుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదుర్తి సుబ్బారావు నా అభిమాన దర్శకుడన్నారు. గాయనీ శారద తన అభిమాని చెప్పారు. ప్రజానటి జమున , సినీ నటుడు డాక్టర్‌ కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ మాట్లాడుతూ చలన చిత్ర రంగానికి మేస్త్రీ దాసరి అన్నారు. శారద ఆకునూరి బృందంచే ఇది మేఘసందేశమో దాసరి చలనచిత్ర సంగీత విభావరి ఆకట్టుకుంది.Sకార్యక్రమంలో ప్రముఖ నటులు జీవీ నారాయణ రావు, లయన్‌ వైకే నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement