breaking news
Raghupathi Venkaiah Award
-
హీరోలకు ఐటెం పాటలే నచ్చుతాయి
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు సినీ రంగంలో నాకున్న మ్యూజికల్ హిట్స్ ఏ దర్శకుడికీ లేవని, అందుకు కారణం గొప్ప సంగీత దర్శకులు దొరకడమేనని మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి నారాయణ రావు అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ఎస్ కొండలరావు అధ్యక్షతన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావుకు స్వరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పుడు రికార్డ్ డ్యాన్స్‌ల సంగీతమే హీరోలకు సంగీతమై కూర్చుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుర్తి సుబ్బారావు నా అభిమాన దర్శకుడన్నారు. గాయనీ శారద తన అభిమాని చెప్పారు. ప్రజానటి జమున , సినీ నటుడు డాక్టర్ కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ మాట్లాడుతూ చలన చిత్ర రంగానికి మేస్త్రీ దాసరి అన్నారు. శారద ఆకునూరి బృందంచే ఇది మేఘసందేశమో దాసరి చలనచిత్ర సంగీత విభావరి ఆకట్టుకుంది.Sకార్యక్రమంలో ప్రముఖ నటులు జీవీ నారాయణ రావు, లయన్ వైకే నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: రఘుపతి వెంకయ్య నాయుడి ఆడియో ఫంక్షన్లో దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరు కుదింపుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇప్పుడు రఘుపతి వెంకయ్యకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి పురస్కారానికి లేని కులం పేరు... రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఫిల్మ్‌నగర్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు పేరు పెట్టాలని ఫిల్మ్‌నగర్ సొసైటీకి సూచించారు. ఉత్తరాదిలో దక్షిణాది సినిమావాళ్లది సెకండ్ గ్రేడ్ బతుకులేనని దాసరి నారాయణరావు వాపోయారు. తరచుగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. తాజాగా అవార్డులపై దాసరి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.