దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు | Dasari Narayana Rao Sensational Comments on Casteism | Sakshi
Sakshi News home page

దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు

Sep 12 2013 11:41 PM | Updated on Oct 2 2018 3:40 PM

దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు - Sakshi

దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు

రఘుపతి వెంకయ్య నాయుడి ఆడియో ఫంక్షన్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: రఘుపతి వెంకయ్య నాయుడి ఆడియో ఫంక్షన్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరు కుదింపుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇప్పుడు రఘుపతి వెంకయ్యకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎన్‌ రెడ్డి పురస్కారానికి లేని కులం పేరు... రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

ఫిల్మ్‌నగర్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు పేరు పెట్టాలని ఫిల్మ్‌నగర్ సొసైటీకి సూచించారు. ఉత్తరాదిలో దక్షిణాది సినిమావాళ్లది సెకండ్ గ్రేడ్ బతుకులేనని దాసరి నారాయణరావు వాపోయారు. తరచుగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. తాజాగా అవార్డులపై దాసరి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement