పెద్దగుట్టపై భక్తుల సందడి | Devotees on Peddagutta | Sakshi
Sakshi News home page

పెద్దగుట్టపై భక్తుల సందడి

Aug 13 2016 7:37 PM | Updated on Sep 4 2017 9:08 AM

స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులు

స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులు

జడ్చర్ల టౌన్‌ : శ్రావణ శనివారం, సెలవుదినం కావడంతో బాదేపల్లి పెద్దగుట్టపై భక్తుల సందడి నెలకొంది. గుట్టపై ఉన్న రంగనాయకస్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

జడ్చర్ల టౌన్‌ : శ్రావణ శనివారం, సెలవుదినం కావడంతో బాదేపల్లి పెద్దగుట్టపై భక్తుల సందడి నెలకొంది. గుట్టపై ఉన్న రంగనాయకస్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కొందరు భక్తులు గుట్టపైనే వంటావార్పు చేసుకుని వన భోజనాలు చేశారు. గుట్టపై భక్తుల రద్దీ పెరగడంతో  రంగానాయక ఆలయ ట్రస్టు కమిటీ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు వద్ద భక్తులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. గుట్టపై నిలిచిన వర్షపునీటిలో ఆటలాడేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement