లారీఢీకొని సైక్లిస్టు దుర్మరణం | cyclist dead | Sakshi
Sakshi News home page

లారీఢీకొని సైక్లిస్టు దుర్మరణం

Aug 9 2016 1:10 AM | Updated on Sep 4 2017 8:25 AM

జీలుగుమిల్లి : మండలంలోని లక్ష్మీపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

జీలుగుమిల్లి : మండలంలోని లక్ష్మీపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సేతుకూరి రామారావు(55) వ్యవసాయ పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ట్యాంకర్‌ లారీ  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ఇరపం భాస్కరరావు తెలిపారు. మృతుడు రామారావు భార్య గతంలోనే మృతి చెందగా..  వ్యవాయ కూలీ పనులు చేసుకుంటూ కుమారుడి వద్ద ఉంటున్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement