కరెంట్‌ షాక్‌తో కాడెడ్లు మృతి | current shock.. Bulls died | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో కాడెడ్లు మృతి

Sep 8 2016 7:59 PM | Updated on Sep 4 2017 12:41 PM

విద్యుత్‌షాక్‌కు గురై కాడెడ్లు మృతిచెందిన సంఘటన మండలంలోని చెండి పొలాల వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

శివ్వంపేట: విద్యుత్‌షాక్‌కు గురై కాడెడ్లు మృతిచెందిన సంఘటన మండలంలోని చెండి పొలాల వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అంతిరెడ్డి నర్సారెడ్డికి చెందిన కాడెడ్లు బుధవారం మేతకు వెళ్లి రాత్రికి తిరిగి రాలేదు. అడవి పందుల బారి నుంచి పంట రక్షించుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ విద్యుత్‌ వైరు ఏర్పాటు చేశాడు.

అటుగా వెళ్లిన కాడెడ్లు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి.  గురువారం ఉదయం విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కాడెడ్లను రైతులు గుర్తించి  నర్సారెడ్డికి సమాచారం అందించారు. కాడెడ్ల విలువ రూ. లక్ష ఉంటుందని బాధిత రైతు బోరున విలపించాడు. కాడెడ్లను నమ్ముకొని వ్యవసాయం సాగుచేస్తున్న తాను ఉపాధి కోల్పోయానని బాధిత రైతు  ఆవేదన వ్యక్తం చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement