అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | cultural programmes in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Mar 19 2017 10:05 PM | Updated on Sep 5 2017 6:31 AM

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్‌ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్‌ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.  సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు.చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరపింపజేశారు. విద్యార్థుల బ్యాస్‌బ్యాండ్‌ వాయిద్యంతో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది. పిదప భరత నాట్య కచేరితో విద్యార్థులు ఆహూతులను ఆలరించారు. చక్కటి నృత్యభంగిమలతో,సుమధుర స్వరాల నడుమ విద్యార్థులు నాట్య కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement