ఇద్దరు బుకీల అరెస్టు | cricket bookies arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు బుకీల అరెస్టు

Apr 30 2017 11:44 PM | Updated on Aug 20 2018 4:30 PM

యాడికిలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేంద్రంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

యాడికి (తాడిపత్రి రూరల్‌) : యాడికిలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేంద్రంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌ఆడుతున్న మణికిశోర్‌, అబ్దుల్‌రహీం అనే బుకీలను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  

హత్యాయత్నం కేసులో మరొకరి అరెస్టు
తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి శ్రీనివాసపురానికి చెందిన నాగభూషణం అనే నిందితుడ్ని హత్యాయత్నం కేసులో ఆదివారం అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తాడిపత్రిలోని పప్పూరు రోడ్డులో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలపాడుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాత కక్షల నేపథ్యంలో తనను హత్య చేయాలన్న కుట్రతో తన ప్రత్యర్థులు టాటా సుమోతో ఢీకొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండ్రోజుల కిందట ముగ్గుర్ని అరెస్టు  చేసిన పోలీసులు, తాజాగా నాగభూషణం అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచినట్లు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement