పాదయాత్రకు జననీరాజనం | cpm padayatra | Sakshi
Sakshi News home page

పాదయాత్రకు జననీరాజనం

Nov 8 2016 11:18 PM | Updated on Apr 3 2019 9:27 PM

పోలవరం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సీపీఎం ఆద్వర్యంలో విలీన మండలాల్లో చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్రగా వస్తున్న నాయకులకు గ్రామ గ్రామానా మహిళలు గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ పూలమాలలు వేసి డప్పు వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ఐదో రోజు మంగళవారం కుసుమనపల్లి గ్రామం నుంచి

  • దిష్టితీస్తూ, పూలమాలలతో మహిళల స్వాగతం
  • తోటపల్లి (నెల్లిపాక) :
    పోలవరం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సీపీఎం ఆద్వర్యంలో విలీన మండలాల్లో చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్రగా వస్తున్న నాయకులకు గ్రామ గ్రామానా మహిళలు గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ పూలమాలలు వేసి డప్పు వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ఐదో రోజు మంగళవారం కుసుమనపల్లి గ్రామం నుంచి తోటపల్లి మీదుగా సాగింది.గిరిజన మహిళలు అధిక సంఖ్యలో హాజరై గిరిజన సంప్రదాయ నృత్యాలతో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. 
    తోటపల్లిలో జరిగిన సభలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాడ్లాడుతూ పోలవరం నిర్వాసితులకు అండగా పోరాడేందుకే తమ పార్టీ పాదయాత్రలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి అరుణ్‌ కిరణ్, సర్పంచ్‌లు సుకో నాయక్, సోంది రామారావు, ఇరప చిన్నక్క, నాయకులు బీబీజీ తిలక్, మర్లపాటి నాగేశ్వరరావు, ఐ వెంకటేశ్వర్లు, మాధవరావు, శేషావతారం, రంబాల నాగేశ్వరరావు, కోడూరి నవీన్, కాక అర్జున్, ఇరప వెంకటేశ్వర్లు ,సాయి, శిరమయ్య,పెంటయ్య, సీతారామయ్య  తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement