సీపీఎం కార్యాలయంపై దాడిని ఖండించాలి | cpm leaders The intersection of attack on delhi | Sakshi
Sakshi News home page

సీపీఎం కార్యాలయంపై దాడిని ఖండించాలి

May 23 2016 12:35 PM | Updated on Aug 13 2018 8:10 PM

ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దాడి చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

ఒంగోలు: ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దాడి చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బీజేపీ మతతత్వ అజెండాతో ముందుకు వె ళ్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ నేతలు పైకి చెబుతూ చాప కింద నీరులా ఆర్‌ఎస్‌ఎస్ విస్తరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ దాడిని ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని, అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పూనాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement