రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజా పాలన పక్కనబెట్టి టీడీపీ నేతలు దోచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.
కోడుమూరు రూరల్ : రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజా పాలన పక్కనబెట్టి టీడీపీ నేతలు దోచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం కోడుమూరులో రైతు మహాసభ సందర్భంగా భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతుంటే వారిని పరామర్శించకుండా టీడీపీ నేతలు డబ్బు సంపాదనకు దొంగదారులు వెతుక్కుంటున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, ప్రజలు రోడ్డు పడ్డారన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చినా నిర్మాణానికి ప్రభుత్వం తాత్సరం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే తాగు, సాగునీటి సమస్యలను తీరుస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతాన్నారు.