కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్ననాయుడుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు!
Oct 19 2016 1:05 AM | Updated on Aug 10 2018 8:23 PM
- కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నాడని ఆరోపణ
కోడుమూరు : కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్ననాయుడుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇతర పార్టీల నేతలతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ప్రభుత్వ పరంగా జరిగే పనుల్లో శుత్రువులకు లబ్ధి చేకూరేలా సహకరిస్తున్నాడని ఫొటోలు, పత్రికా క్లిప్పింగ్‌లతో సహా నివేదించినట్లు తెలిసింది. కేంద్ర రైల్వే మాజీ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడని, భవిష్యత్తులో ఆయన వెంటే వెళ్లే అవకాశాలున్నాయని వివరించినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని, ఆయనపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉందని వివరించినట్లు తెలిసింది. రేషన్ దుకాణాలు, వంట ఏజెన్సీలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా వంటి పోస్టుల్లో ఎక్కువ భాగం ఇతర పార్టీలకు చెందిన వారికే లబ్ధి చేకూర్చారని, ఆ వివరాలను సాక్ష్యాధారాలతో అందజేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కోడుమూరు సీటుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వివరించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement