ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి
May 29 2017 11:31 PM | Updated on Mar 21 2019 8:35 PM
– పలువురు ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
కర్నూలు (అర్బన్): ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో ఆయన హౌసింగ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు నెలలో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రారంభమైనా, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారంలోగా మంజూరైన ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ హుసేన్ సాహెబ్, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement