టెట్‌కు ఏర్పాట్లు చేయండి

టెట్‌కు ఏర్పాట్లు చేయండి


ఖమ్మంసహకారనగర్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారని, నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. టెట్‌ నిర్వహణపై బుధవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టెట్‌ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు.పేపర్‌–1 23న ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ పరీక్షకు మొత్తం 31,759 మంది హాజరుకానుండగా 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అంతరా యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని, సకాలంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ డీఈఓ మురళీధర్, జిల్లా పరీక్షల నిర్వహణ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్, ఏసీపీ గణేష్, ఆర్టీసీ ఆర్‌ఎం జగన్, సూపరింటెండెంట్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top