ఏలూరు అర్బన్ : పెదవేగి మండలం పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజుపై తుపాకీ కాల్పుల కేసులో మరో నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు గురువారం విచారించారు.
తూరపాటి నాగరాజు కేసులో నిందితుని విచారణ
Published Fri, Oct 21 2016 2:18 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలం పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజుపై తుపాకీ కాల్పుల కేసులో మరో నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు గురువారం విచారించారు. గత జూలై 28న స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో తూరపాటి నాగరాజుపై అతని బంధువులే తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తూరపాటి పెదబాబు, ఇర్ఫాన్, రాజేష్ వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే కేసులో మరో నిందితుడు భూతం శ్రీనివాసరావు నాటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ఈ నెల 17న జిల్లా కోర్టులో లొంగిపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని ఒక్కరోజు విచారణకు అనుమతించాలని కోర్టుకు విన్నవించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం విచారించారు. అయితే ఈ కేసులో పోలీసులు ఇంకా భూతం గోవిందు, ఊరకొండను విచారించాల్సి ఉంది.
Advertisement
Advertisement